Homeతెలంగాణప్రభుత్వ హాస్పిటల్ సమస్యలపై ఎమ్మెల్యే కు వినతి

ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలపై ఎమ్మెల్యే కు వినతి

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14:

గార్ల సి హెచ్ సి హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించి, సంబంధిత పారామెడిక్ సిబ్బందిని నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు. మండల పర్యటనకు శుక్రవారం వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సిపిఎం ఆధ్వర్యంలో మండల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సి హెచ్ సి హాస్పిటల్ లో మృతదేహాల భద్రత కోసం ఫ్రిజర్ బాక్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆక్సిజన్ ప్లాంట్ సక్రమంగా పనిచేసేందుకు, రోగుల వైద్యoకు సరిపడా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్,జనరేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆపరేషన్ థియేటర్‌కు అవసరమైన అనస్తీషియా, గైనకాలజీ పరికరాలు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రోగులకు అత్యవసర ఇ సి జి సేవలు అందించేందుకు ఈసీజీ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, దంత వైద్యానికి సంబంధించిన పరీక్ష పరికరాలను కేటాయించాలని, అత్యవసర సేవల కోసం సి హెచ్ సి కి ప్రత్యేక అంబులెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. హాస్పిటల్లో అదనంగా ఐదుగురు వైద్యులను నియమించడం, రాంపురం కు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కు కృషిచేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను శాలువ ను కప్పి ఘనంగా సత్కరించారు.వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం నాయకులు వి.పి. వెంకటేశ్వర్లు, ఏం నాగమణి,కె. సుజాత, ఎస్. నాగరాజు,బి. శ్రీను తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular