గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12:
గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆరాధ్య దేవత ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను బుధవారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలోని మహిళలు ప్రత్యేకంగా అలంకరించుకుని బోనాలను నెత్తిన ఎత్తుకుని మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామ సర్పంచ్ బాదావత్ సరోజినీ రవి నాయక్ లు అమ్మవారికి సుమారు పదివేల రూపాయల విలువైన వెండి ఆభరణాలతో తయారుచేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు.బోనాల వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, భక్తుల సందడి మధ్య అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.ప్రతి ఏడాది నిర్వహించే ముత్యాలమ్మ బోనాలను గ్రామ ప్రజలు ఐక్యంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఆడపు వెంకటేశ్వర్లు గుండా వెంకట్ రెడ్డి రేగళ్ల దామోదర్ రెడ్డి కృష్ణారెడ్డి ఎడపల్లి ఉపేందర్ మాజీ ఉపసర్పంచ్ నవత సంతోష్ రెడ్డి పిడుగు సురేందర్ మారం సందీప్ రెడ్డి జగదీష్ బోళ్ల ఉమా సిరిమర్తి రాజేష్ రమణ వెంకటమ్మ ఉమా సుధాకర్ రెడ్డి చంద్రకళ ఉపేందర్ సిరిమర్తి రవి సిరిమర్తి వీరన్న శ్రీను గురువయ్య గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

