Homeతెలంగాణరోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12:

విద్యార్థులు, యువత రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారి సూచించారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్‌ ఆవశ్యకత, డ్రైవింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రాజకుమారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత మాత్రమే డ్రైవింగ్‌ చేయాలని, ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. రహదారులపై వేగంగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో విలువైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల గ్రంథపాలకులు లక్ష్మాలాల్‌ను అధ్యాపకులు, విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వేముల రవీందర్‌, అధ్యాపకులు, స్టూడెంట్‌ కౌన్సిలర్‌ అడపాల ప్రసాదరావు, డెమో ప్రెసిడెంట్‌ జోగ్య నాయక్‌, జి. సోమన్న, జి. రాంబాబు, జి. సుజాత, రమణతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular