గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15:
స్వాతంత్ర్య పోరాటంలోకమ్యూనిస్ట్ల పాత్ర గర్వించదగిన దని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలవాల సత్యవతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ లు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మంగపతి రావు భవనం పై మువ్వన్నెల జాతీయ జెండాను సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి ఎగురవేసి గౌరవ వందనం చేశారు అనంతరం ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో కమ్యూనిస్టు లు నిర్వహించిన పాత్ర గర్వించదగినదని అన్నారు.1921- 1924 మధ్య కమ్యూనిస్ట్ ఉద్యమానికి వ్యతిరేకంగా మూడు కుట్ర విచారణలు జరిగాయని వీటిలో మొదటి పెషావర్ కుట్ర కేసు,మీరట్ కుట్ర, కాన్పూర్ కుట్ర కేసులను పెట్టి శ్రీపాద్ అమృత్ డాంగే, ఎమ్ ఎన్ రాయ్, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త తదితర నాయకులపై కుట్రల కేసులు బనాయించి జైలు పాలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంతో ఏ మాత్రం సంబంధంలేని బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు మేమే నిజమైన దేశభక్తులు అంటూ ప్రచారం చేసుకుంటూ వేడుకలను నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.భారత స్వాతంత్ర ఉద్యమం లో విప్లవ యోధులు భగత్ సింగ్, హైదర్ అలీ ఖాన్,పుచ్చల పల్లి సుందరయ్య కమ్యూనిస్టులనేని అని అన్నారు.కమ్యూనిస్టులు పలు దఫాలుగా నిరసనలు, సమ్మెలు, ఇతర కార్యక్రమాల ద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుల పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి వీరభద్రం,టి నాగేశ్వరరావు, పూర్ణచంద్రరావు, బి శ్రీను, కే రామకృష్ణ, నాగమణి, బిఆర్ఎస్, టిడిపి పార్టీల మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, వై కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.

