Homeతెలంగాణఎంతో మంది త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

ఎంతో మంది త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15:

ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జడ్.పి.హెచ్.ఎస్  ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు  పెద్ది పద్మావతి అన్నారు.గార్ల మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో  80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె  జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయురాలు మాలోత్ కవిత తన భర్త భూక్య లాలు  జ్ఞాపకార్ధంగా  1st ర్యాంకు సాధించిన మాలోత్ కిరణ్ కు 2500 ,గురు సాయిరాంకు 1500 ,సిరిపంగి అఖిల్ కు 1000   నగదు ప్రోత్సాహకం అందజేశారు. అదేవిధంగా  పుట్టా రాములమ్మ  జ్ఞాపకార్ధకంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే ప్రోత్సాహకంలో భాగంగా  కుమార్తె పంజాల పద్మ మొదటి ర్యాంకు సాధించిన మాలోత్ కిరణ్ కు 1016/ రెండవ ర్యాంకు సాధించిన ఎట్టి గురు సాయిరాంనకు 1016 రూపాయల  నగదు బహుమతులను అందజేశారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకొని భారత్‌ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర సమరయో ధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ రమేష్,కన్నయ్య,కవిత, వీరస్వామి , భీమ, శ్రీను, రమేష్,వెంకట్రావు,ప్రభాకర్,రంజిత్, రామకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular