Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఎట్ హోం కార్యక్రమానికి ఎంపికైన ఏయూ విద్యార్థిని

ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికైన ఏయూ విద్యార్థిని

ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికైన ఏయూ విద్యార్థిని

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     విశాఖపట్నం, ఆగస్టు 11: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న లోక్‌భవన్‌లో నిర్వహించనున్న ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.ఎస్.ఎల్.వి. సృజన ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్‌భవన్ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అధికారిక సమాచారం అందినట్లు ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య డి. సింహాచలం తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో ఫార్మా-డీ చదువుతున్న సృజన తన ప్రతిభతో ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా లోక్‌భవన్ నిర్వహించే ప్రత్యేక ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల ఏయూ వర్గాలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సృజనను పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular