Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి పోరాడాలి సౌత్ అధ్యక్షుడి నియామకంపై వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సత్కరించిన కళింగ...

కళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి పోరాడాలి సౌత్ అధ్యక్షుడి నియామకంపై వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సత్కరించిన కళింగ కోమటి పెద్దలు

కళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి పోరాడాలి

సౌత్ అధ్యక్షుడి నియామకంపై వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సత్కరించిన కళింగ కోమటి పెద్దలు

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్   విశాఖపట్నం, ఆగస్టు 11: కళింగ వైశ్యుల సమస్యలు, వారి డిమాండ్ల పరిష్కారానికి నూతనంగా నియమితులైన కళింగ వైశ్య బీసీ అధ్యక్షుడు పట్నాన రమణ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ సూచించారు.

కళింగ వైశ్య బీసీ అధ్యక్షుడిగా పట్నాన రమణ నియమితులైన సందర్భంగా మంగళవారం ఆసీలమెట్టలోని వాసుపల్లి కార్యాలయంలో కళింగ కోమటి పెద్దలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో కళింగ వైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, వారు రాజకీయంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

పాత నగరంలో కొలువై ఉన్న వాసవీమాత ఆశీస్సులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మళ్లీ పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం రావాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కళింగ కోమటి పెద్దలు మాట్లాడుతూ ప్రజా సేవలో, ప్రజా సమస్యలపై పోరాటంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కళింగ వైశ్య వర్గం అండగా ఉంటుందని తెలిపారు.

తనను కళింగ వైశ్య బీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పట్నాన రమణ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 39వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, జిల్లా ఆర్టీఐ జనరల్ సెక్రటరీ ఆరుగుల రాజు, జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ, జిల్లా బూత్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గంగీరి ధనరాజు, సౌత్ స్టూడెంట్ ప్రెసిడెంట్ వి.టి. కృష్ణ, 39వ వార్డు జనరల్ సెక్రటరీ వెంకటి, రామోలు సత్య, 39వ వార్డు యూత్ ప్రెసిడెంట్ మైలిపిల్లి ఆదినారాయణ, 39వ వార్డు స్టూడెంట్ ప్రెసిడెంట్ మైలిపిల్లి కాసుబాబు, ఇబ్రహీం తదితరులతో పాటు కళింగ కోమటి నాయకులు జామి రవికుమార్, ఇప్పిలి గణేష్, పొట్నూరు జగదీశ్వరరావు, గుడ్ల వెంకటరమణ, పట్నాన మల్లేశ్వరరావు, కిల్లంశెట్టి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular