విద్యుత్ సమస్యలపై నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 13: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఐఏఎస్ తెలిపారు.
విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వినియోగదారులు 8688400499 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో జాప్యం, సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, రూఫ్‌టాప్ సోలార్ తదితర సమస్యలపై ఫిర్యాదులు తెలియజేయవచ్చని తెలిపారు.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి కోరారు.

