Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నం115 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగుల పంపిణీ

115 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగుల పంపిణీ

115 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగుల పంపిణీ

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగస్టు 13: కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగదాంబ ప్రాంతానికి చెందిన 115 మంది పాఠశాల విద్యార్థులకు గురువారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. జోష్ మాట్లాడుతూ, “మనం పొందడం ద్వారా జీవిస్తాము.. ఇవ్వడం ద్వారా శాశ్వతంగా నిలిచిపోతాము” అనే సూత్రంతో తమ సంస్థ విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు చిన్ననాటి నుంచే నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఏవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు. బాల్యంలో నేర్చుకునే అంశాలే భవిష్యత్తుకు పునాది అవుతాయని, విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

రోటరీ క్లబ్ సౌత్ డిస్ట్రిక్ట్ చైర్ సత్యశ్రీ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివిధ రకాల పనులను నేర్చుకోవడం ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చన్నారు. పాఠశాలల్లో నిర్వహించే ‘నో బ్యాగ్ డే’ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె. రమాప్రభ మాట్లాడుతూ పిల్లల్లో స్నేహం, సహకారం, సమభావం, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేందుకు వివిధ క్లబ్బులు, సృజనాత్మక అభ్యసన కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పాఠశాల బ్యాగులు అందించిన కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ కె. సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవిరాజా, శివకుమార్, సమన్వయకర్త పి. సతీష్, జగదాంబ జోన్ కన్వీనర్ పి. సరోజాదేవి, జిల్లా అధ్యక్షురాలు సాయి జాహ్నవి, సృజనాత్మక అభ్యసన కేంద్రాల నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular