మహేష్ బాబు సేవలు అభినందనీయం
– ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 8: సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
విశాఖ సిటీ వైడ్ కృష్ణ & మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహేష్ బాబు ముందస్తు జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబు భారీ కటౌట్‌ను ప్రారంభించి, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.
మహేష్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమ ప్రాంగణంలో సందడి నెలకొంది. అభిమానులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమాన నటుడిపై అభిమానం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంపంగి శ్రీను, స్టేట్ డైరెక్టర్ రూప, రాజేష్, డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, రమణ, గణేష్, మహేష్ రెడ్డి, శ్రీధర్ తదితరులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు, మహేష్ బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

