Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసస్పెక్ట్‌ షీట్‌దారులపై ముందస్తు చర్యలు.. 9 మందికి బైండోవర్

సస్పెక్ట్‌ షీట్‌దారులపై ముందస్తు చర్యలు.. 9 మందికి బైండోవర్

సస్పెక్ట్‌ షీట్‌దారులపై ముందస్తు చర్యలు.. 9 మందికి బైండోవర్

 

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్           కూర్మన్నపాలెం, ఆగస్టు 14 : నేరాల నియంత్రణ, ముఖ్యంగా ఆస్తి నేరాలను ముందుగానే అరికట్టే చర్యల్లో భాగంగా దువ్వాడ పోలీసులు సస్పెక్ట్‌ షీట్‌దారులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన తొమ్మిది మంది సస్పెక్ట్‌ షీట్‌దారులను మండల మేజిస్ట్రేట్‌ (ఎంఆర్‌ఓ) కోర్టులో బైండోవర్‌ చేశారు.

పాత నేరస్తులు తిరిగి నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నేరాలకు పాల్పడినా, ఇతరులను నేరాలకు ప్రోత్సహించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.డి. బాబు, ఎస్‌ఐ సత్తిబాబు, ఏఎస్సై మధు, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌ సస్పెక్ట్‌ షీట్‌దారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసుల సూచనలు, బైండోవర్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

బైండోవర్‌ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడితే, బైండోవర్‌ షరతుల మేరకు రూ.2 లక్షల బాండ్‌కు సంబంధించిన చర్యలతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు, శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నేరాలను ముందుగానే అరికట్టేందుకు పాత నేరస్తులు, సస్పెక్ట్‌ షీట్‌దారుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఇన్‌స్పెక్టర్‌ జి.డి. బాబు తెలిపారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular