Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నందివ్యాంగ చిన్నారుల మధ్య.. రేష్మిత పుట్టినరోజు సందడి!

దివ్యాంగ చిన్నారుల మధ్య.. రేష్మిత పుట్టినరోజు సందడి!

దివ్యాంగ చిన్నారుల మధ్య.. రేష్మిత పుట్టినరోజు సందడి!

ఆర్భాటాలకు దూరంగా ఆప్యాయతకు పెద్దపీట.. ప్రత్యేక పాఠశాలలో సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      విశాఖపట్నం, ఆగస్టు 8:
జన్మదిన వేడుకలను ఆర్భాటంగా కాకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. హోంమంత్రి అనిత కుమార్తె రేష్మిత జన్మదిన వేడుకలు విశాఖ నగరంలోని ఉషోదయ జంక్షన్‌లో ఉన్న హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో శనివారం ఆప్యాయంగా జరిగాయి.

రేష్మిత తన సోదరుడు నిఖిల్‌తో కలిసి ప్రత్యేక పాఠశాలకు చేరుకుని అక్కడి దివ్యాంగ చిన్నారులతో మమేకమయ్యారు. చిన్నారుల మధ్య రేష్మిత కేక్ కట్ చేసి వారితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

అనంతరం చిన్నారులకు రేష్మిత స్వయంగా పోషకాహారం, తాజా పండ్లను పంపిణీ చేశారు. చిన్నారులతో కొంతసేపు ఆప్యాయంగా గడిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది.

సేవా కార్యక్రమాలతో ప్రత్యేకత

ఇటీవల హోంమంత్రి అనిత కుమారుడు నిఖిల్ కూడా విజయవాడలోని మేరీ బ్లైండ్ పాఠశాలలో తన జన్మదిన వేడుకలను నిర్వహించారు. వరుసగా ప్రత్యేక పాఠశాలల చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం పలువురి ప్రశంసలు అందుకున్నారు

ఉషోదయ జంక్షన్‌లోని హిడెన్ స్ప్రౌట్స్ ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగ చిన్నారుల మధ్య కేక్ కట్ చేస్తున్న రేష్మిత, ఆమె సోదరుడు నిఖిల్. చిన్నారులకు పోషకాహారం, తాజా పండ్లు పంపిణీ చేస్తున్న దృశ్యం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular