Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్...

సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్ ద్వారా వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన

గంటలోనే 40 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి, ఆగస్టు 8 (పెన్ పవర్):
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శనివారం పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఈనాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా ఫోన్ కాల్స్ ద్వారా వినతులను స్వీకరించారు.

ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఒక గంట వ్యవధిలో 40 వినతులు ఎమ్మెల్యేకు అందాయి. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్లు, రేషన్, రెవెన్యూ తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular