Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నండీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మూడు రోజుల రిలే నిరాహార...

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ

వాసుపల్లి గణేష్ కుమార్ మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

 

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     విశాఖపట్నం, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ప్రాంగణంలో ఆగస్టు 6, 7, 8 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు, అంశంపై ప్రసంగాలు, వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దీక్షల షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు (ఆగస్టు 6) 41, 27, 30, 31, 32 వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. రెండో రోజు (ఆగస్టు 7) 33, 34, 35, 29 వార్డుల ప్రతినిధులు నిరసనలో పాల్గొననున్నారు. మూడో రోజు (ఆగస్టు 8) 36, 37, 38, 39, 42 వార్డుల నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో దీక్షలు ముగియనున్నాయి.

ఈ మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత వార్డుల ప్రజలు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular