Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురేపు సిగినాపల్లిలో ‘మీ భూమి – మీ హక్కు’ పత్రాల పంపిణీ

రేపు సిగినాపల్లిలో ‘మీ భూమి – మీ హక్కు’ పత్రాల పంపిణీ

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 6: గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని సిగినాపల్లి గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 7) ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన రైతులకు వారి భూ హక్కులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పీసా కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ కోరారు.రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించే దిశగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం కీలకమని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular