గూడెం కొత్త వీధి పెన్ పవర్ సెప్టెంబర్ 29 : ఊపిరితిత్తుల సమస్యతో అనారోగ్యానికి గురై విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుంట బింగు కుమారుడు గుంట మార్క్‌కు గ్రామస్తులు మానవత్వంతో అండగా నిలిచారు.వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గూడెం కాలనీ గ్రామ ఉద్యోగులు, మహిళలు, యువకులు, పెద్దలు స్పందించి చేయి చేయి కలిపి రూ.40,000లు సేకరించారు. ఈ మొత్తాన్ని గ్రామ యువకులు సేవ ప్రేమ్‌కుమార్, నాడెలి సాయి విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి వెళ్లి గుంట మార్క్ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆపదలో ఉన్న మార్క్ కుటుంబానికి గ్రామస్తులు అందించిన రూ.40,000 ఆర్థిక సహాయం వారికి అండగా నిలిచింది. గ్రామస్తుల సేవా స్ఫూర్తిని పలువురు అభినందించారు.

