Homeఆంధ్రప్రదేశ్గూడెం పాతవీధి వద్ద లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరికి తీవ్ర గాయాలు!

గూడెం పాతవీధి వద్ద లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరికి తీవ్ర గాయాలు!

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 11:జీకే వీధి మండలంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో దారకొండ దారాలమ్మ ఆలయానికి వెళ్తుండగా గూడెం పాతవీధి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కళ్యాణ్, రాంజీ స్థానికుల సహాయంతో క్షతగాత్రులను డోలిపై రోడ్డుపైకి తీసుకువచ్చి అనంతరం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular