Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో నిబంధనలు ఉల్లంఘన

ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో నిబంధనలు ఉల్లంఘన

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మున్సిపాలిటీ పార్టీ నాయకులతో కలిసి ఆర్డీఓ వి.వి. రమణకు వినతిపత్రం అందజేశారు.అనంతరం గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీలో అధికారులను ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. వార్డుల మధ్య ఓటర్ల సంఖ్యలో 10 శాతానికి అటు ఇటుగా మాత్రమే వ్యత్యాసం ఉండాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు గణేష్ తెలిపారు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular