Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిపెద్ద బొడ్డేపల్లిలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు మృతి

పెద్ద బొడ్డేపల్లిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు యువకులు మృతి

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పెదబొడ్డేపల్లిలోని గురుకుల పాఠశాల వద్ద టిప్పర్ ని కారు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న టౌన్ సిఐ గఫూర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ హాస్పటల్ కు తరలించి, అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. యువకులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular