గూడెంకొత్తవీధి మండలం డొక్కులూరు ఘాట్ సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు పరామర్శించారు.డొక్కులూరు నుంచి సంకాడ కొత్తూరుకు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు సుమారు 30 మంది రైతులు, గ్రామస్థులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పలువురికి గాయాలు కాగా, కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల పార్టీ అధ్యక్షులు నిర్మాని మత్యకొండం నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
డొక్కులూరు ఘాట్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
RELATED ARTICLES

