- హక్కు పత్రాలు, పాస్‌పుస్తకాల పంపిణీ
- గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 3: అల్లూరి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు గూడెంకొత్తవీధి మండలంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద భూ హక్కు పత్రాలు, పాస్‌పుస్తకాల పంపిణీ చేపడుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న దామనాపల్లి పంచాయతీ పరిధిలోని కట్టుపల్లి గ్రామంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు తెలిపారు. పీసా గ్రామసభ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొనాలని ఆయన కోరారు.
కట్టుపల్లిలో సెప్టెంబర్ 7న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం
RELATED ARTICLES

