గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 1:
గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ లోని కాలి స్థలంలో పెరిగిన పిచ్చి చెట్లు, దట్టమైన పొదలతో ఓ కుటుంబానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. చెట్ల మధ్య దోమలు, పాములు, విషపురుగులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచు కొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లలో పాములు విష పురుగుల సంచారంతో ఈ పరిస్థితి స్థానికులకు కూడా ఇబ్బందికరంగా మారింది. స్థానికురాలు అస్మత్ మాట్లాడుతూ ఇంటి పక్కనే పిచ్చి చెట్లు, పొదలు దట్టంగా పెరిగి ఉండటంతో ఆ ప్రాంతం దోమలకు ఆవాసంగా మారిందని సాయంత్రం అయితే దోమల బెడద మరింత తీవ్రంగా ఉంటోందని మరోవైపు పొదల్లో పాములు, విషపురుగులు సంచరిస్తుండటంతో రాత్రివేళల్లో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నామనివాపోతున్నారు. స్థలం యజమానులు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ పిచ్చి చెట్లు తొలగించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని . దోమల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పాముల సంచారంతో ప్రాణహాని జరిగే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి మా ఇంటి పక్కన పెరిగిన పిచ్చి చెట్లు, పొదలను వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడంతో పాటు పాములు, విషపురుగుల బెడదను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

