Homeతెలంగాణకాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 31:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్దం కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించేలా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఫ్యాక్స్ చైర్మన్ లక్కినేని సురేందర్ శీలంశెట్టి రమేష్ బుడగ మురళి ఎండి ఖదీర్ రాందాస్ బాలు హరిలాల్ మర్రిగూడెం వెంకటేశ్వర స్వామి మాజీ చైర్మన్ అమరచంద్ శ్రీనాథ్ అనీల్ పాషా వెంకటేష్ విజయ్ జాకు రాములు ఉమేష్ దేశపాక మురళి నరసింహ నునావత్ నరసింహ, ఉపేందర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular