Homeతెలంగాణడీజేల హోరు.. జనం బేజారు

డీజేల హోరు.. జనం బేజారు

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 1:

పండుగలు, వివాహాలు, ఊరేగింపులు, ఇతర శుభకార్యాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డీజేల మోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమితికి మించి శబ్దాన్ని పెంచి డీజేలు నిర్వహిస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళల్లోనూ డీజేలను భారీ శబ్దంతో నిర్వహించడం వల్ల ప్రశాంతతకు భంగం కలుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.సాధారణంగా 70 నుండి 85 డెసిబెల్స్  వరకు ఉండే ధ్వని మానవ చెవులకు సురక్షితం కాగా, ప్రస్తుతం వాడుతున్న భారీ డీజే సౌండ్ సిస్టమ్స్ 100 నుండి 150 డెసిబెల్స్ వరకు ధ్వనిని విడుదల చేస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుముఖ్యంగా నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధ్వని తరంగాలు 70 నుంచి 85 డేసి బెల్స్ వరకు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నివేదికలు చెప్తున్నా డీజే నిర్వాహకులు బేకాతరు చేస్తూ అధిక ధ్వని పెంచడంతో ధ్వని కాలుష్యం ఏర్పడి గుండెపోటు బ్రెయిన్ టోకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. డీజే నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయాల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని, అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని స్థానికులు సూచిస్తున్నారు. డీజే నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూ కట్టడి చేయాలని నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular