Homeతెలంగాణఅంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

*ఆటపాటలు, కోలాటాలతో సందడిగా సాగిన వేడుకలు*

ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 15 :

ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ఆర్ఎస్ నగర్ కాలనీలో బుధవారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కాలనీలోని ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలు, కోలాటాలతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకుంటూ బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు సైతం ఈ వేడుకల్లో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్ఎస్ నగర్ కాలనీలో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికుల్లో ఆనందోత్సాహాలను నింపాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని స్థానికులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular