Homeతెలంగాణమధుసూదనాచారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు

మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు

మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు

వృద్ధులకు అన్నదానం, బేడీషీట్లు, నిత్యావసర సరుకులు పంపిణి

వనస్థలిపురం వృధాశ్రమంలో సేవ కార్యాక్రమం

ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 13: 

శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ.. మధుసూదనాచారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయన చేపట్టే ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజంలో మానవత్వం, సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు నవీన్, రాకేష్, వినయ్ కుమార్, రవి యాదవ్, సాయి యాదవ్, కళ్యాణ్, రాజ్, లక్కీ గౌడ్, శరత్, కౌశిక్, వంశీ, మజీద్, నవీన్ కుమార్, పవన్, నరేష్, ఆసిఫ్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular