Homeఆంధ్రప్రదేశ్తుఫాను ముప్పు.. అప్రమత్తతే రక్షణ!: వైసిపి జడ్పిటిసి అభ్యర్థి కంకిపాటి గిరి ప్రసాద్

తుఫాను ముప్పు.. అప్రమత్తతే రక్షణ!: వైసిపి జడ్పిటిసి అభ్యర్థి కంకిపాటి గిరి ప్రసాద్

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 28: అర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి, మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో చెట్లు విరిగిపడటం, కొండచరియలు జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాగులు, గెడ్డలు దాటవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని గిరిప్రసాద్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular