గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 28: అర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంకలు దాటవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాను వేళ అప్రమత్తంగా ఉండండి: పసుపులేటి నాగమణి
RELATED ARTICLES

