- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ టి. నిషాంతి ఆదేశాలు
- స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 25:తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్ని మండలాల్లో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాగులు, గెడ్డలు దాటే ప్రయత్నం చేయవద్దని, అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు:
📞 ల్యాండ్‌లైన్: 08935-293448
📱 అత్యవసర నంబర్: 92818 56953
ప్రమాదాలు, వరదలు, రహదారి అంతరాయాలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.

