Homeతెలంగాణహైదరాబాద్బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం

ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 25:

రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, నవదీప ఫౌండేషన్ సహకారంతో బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అవసరార్థులు కలిపి సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఆకలితో బాధపడుతున్న పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద సేవకులు పాల్గొని భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కోరారు. మరింత మంది సహకరిస్తే అవసరమైన వారికి విస్తృతంగా సేవలందించవచ్చని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular