Homeఆంధ్రప్రదేశ్రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి

రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 25: ఎన్నికల నేపథ్యంలో టీవీలు, డిజిటల్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలన్నా, ప్రచురించాలన్నా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి సూచించారు.రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని తెలిపారు. ఎన్నికల సమయంలో మీడియా ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ పెయిడ్ న్యూస్‌ను గుర్తిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల పారదర్శకతకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా సంస్థలు ఎంసీఎంసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular