Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లితొలి రోజు ప్రచారంలో చింతకాయల అనిత పై అభిమానపు జల్లు

తొలి రోజు ప్రచారంలో చింతకాయల అనిత పై అభిమానపు జల్లు

ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ సతీమణి కళావతి

ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు, మహిళలు

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న చింతకాయల అనిత మంగళవారం సాయంత్రం 37 వ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. 37, 38 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు కర్రి సంతోషి, లాలం లక్ష్మి లతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు వార్డు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. అడుగడుగునా చింతకాయల అనితకు మంగళ హారతులు పట్టారు.

అనిత ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ గతంలో మున్సిపల్ పర్సన్ గా పనిచేసిన పాలన అనుభవం ఉందన్నారు. మరొకసారి అవకాశం ఇస్తే పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలిరోజు ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ సతీమణి కళావతి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular