150 మంది కార్యకర్తలు చేరనున్నట్లు ప్రచారం!
నర్సీపట్నం, పెన్ పవర్ :
అనకాపల్లి జిల్లా, మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మూకల బాలకృష్ణ ఈ శనివారం టీడీపీలో చేరనున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరేందుకు పార్టీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. అదేవిధంగా, గిడుతూరు గ్రామానికి చెందిన సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ చేరికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలు నిజమైతే గిడుతూరు గ్రామ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

