
పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ చింతకాయల రాజేష్
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ, సుబ్బారాయుడుపాలెంలో హనుమాన్ కాఫీ కేఫ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘స్టోరీస్ ఎరీనా స్పోర్ట్స్ కాంప్లెక్స్’ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రికెట్ ఆటను యువ నాయకులు టిడిపి పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ బ్యాటింగ్ చేసి ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నేటి యువత క్రీడల పట్ల మరింత ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ ఇటువంటి క్రీడలు ఆడటం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లభించడమే కాకుండా, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇలాంటి క్రీడా ప్రాంగణాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు.

