Homeఆంధ్రప్రదేశ్బాపట్లరాష్ట్ర సుభిక్షం కోసం వరుణ యాగం

రాష్ట్ర సుభిక్షం కోసం వరుణ యాగం

వేటపాలెం, అక్టోబరు 6: రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రైతులకు సమృద్ధిగా నీరు అందాలని ఆకాంక్షిస్తూ వేటపాలెం మండలం రావూరిపేటలోని శ్రీశ్రీశ్రీ కనక నాగారప్పమ్మ దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ యాగంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బాలకొండమ్మ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి కొరత లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమం, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఎమ్మెల్యే కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular