Homeఆంధ్రప్రదేశ్బాపట్లలక్కీ డ్రాతో పారిశుద్ధ్యంపై అవగాహన

లక్కీ డ్రాతో పారిశుద్ధ్యంపై అవగాహన

 కారంచేడు, అక్టోబర్ 3 :  కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలో దసరా, దీపావళి సందర్భంగా బోనంజా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్.కె. కృష్ణ తెలిపారు. గ్రామస్థులు ఐదు కిలోల పొడి వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందించి లక్కీ డ్రా కూపన్ పొందాలని సూచించారు. డ్రాలో మొదటి బహుమతిగా మిక్సర్ గ్రైండర్, రెండో బహుమతిగా డిన్నర్ సెట్, మూడో బహుమతిగా వాటర్ బాటిల్ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ రథం సేవలను వినియోగించుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular