Homeఆంధ్రప్రదేశ్కాకినాడమండల వ్యాప్తంగా ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

మండల వ్యాప్తంగా ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు.. గ్రామ సమస్యలపై చర్చ

కాజులూరు, పెన్ పవర్, అక్టోబర్ 2:
కాజులూరు మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కాజులూరు మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల్లో తహశీల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీడీవో జె. రాంబాబు,మండల వ్యవసాయ అధికారి వి.అశోక్,ఏవో పద్మలత,డీటీ ఎం. శ్రీనివాసరావు,ఆర్‌ఐ పి. వేగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం. సత్యనారాయణమూర్తి, ఎం. డేవిడ్, వీఆర్వోలు,పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


  1. గ్రామాల్లో గ్రామ సభలుగాంధీ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కోలంక, తర్లంపూడి, జగన్నాధగిరి, అండ్రంగి, శలపాక తదితర గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై గ్రామ సభల్లో చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, గ్రామ పరిశుభ్రత, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.కోలంక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, తహశీల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభలో స్థానిక సమస్యలపై చర్చించారు.
    తర్లంపూడి, జగన్నాధగిరి గ్రామాల్లో గ్రామ సభల అనంతరం ప్రత్యేక అధికారి పి. జాన్ గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అందించిన సేవలు, ఆయన ఆశయాలు సమాజానికి ఎప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.
    గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామాల పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.ఈ కార్యక్రమాల్లో పంచాయతీ సిబ్బంది,వైద్య సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular