గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా దుస్తులు పంపిణ
: గ్రామ సర్పంచ్ శిల్ప ప్రేమాకర్, ఉపసర్పంచ్ పావని జంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, పెన్ :పవర్ అక్టోబర్ 16
దసరా పండుగను పురస్కరించుకుని ముకునూరు గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను గ్రామ సర్పంచ్ శిల్ప ప్రేమాకర్, ఉపసర్పంచ్ పావని జంగారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలతో పాటు పంచాయతీ సిబ్బందికి ఎల్లపుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు యంజాల కిరణ్ కుమార్, పుట్ట మానస, రాజ్ కుమార్, గోరింకల శ్రీనివాస్, పులి శివకుమార్, గ్రామపంచాయతీ కారోబార్ ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

