బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా 157వ జయంతి వేడుకలు
గంగవరం, పెన్ పవర్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గంగవరం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, పరిశుభ్రత, సేవాభావం వంటి విలువలను విద్యార్థులు జీవితంలో ఆచరించాలని సూచించారు.
కార్యక్రమంలో గంగవరం మండల కూటమి టీడీపీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు కుంజం సిద్దు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజం వెంకటేశ్వర్లు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కనిగిరి సుభాష్, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మ, బూత్ ఇన్‌చార్జి సారపు సత్యవేణి, వీరభత్తుల రాజేంద్రప్రసాద్, జనసేన నాయకులు గవరాజు, సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, వార్డెన్ లావణ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

