Homeఆంధ్రప్రదేశ్పోలవరంమహాత్మునికి నివాళి సమష్టి బాధ్యత

మహాత్మునికి నివాళి సమష్టి బాధ్యత

గాంధీజీ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించడం యావత్తు జాతి బాధ్యత అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం గడువోకుర్తి పంచాయతీ చీడిపాలెంలో శుక్రవారం గాంధీజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం, సేవాభావం వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకురావాలని ఆమె సూచించారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు.

అనంతరం ‘సేవా సంకల్ప్ అభియాన్–సేవా మేరా యోగ్‌దాన్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు. పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, టీడీపీ నాయకులు గణజాల తాతారావు, వాసంశెట్టి గంగాధర్, పంచాయతీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular