పాతచీరాలలో ఘటన.. చీరాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి బాధితుడి తరలింపు
చీరాల, అక్టోబరు 25 :
బాపట్ల జిల్లా చీరాల మండలం పాతచీరాలలో ఆదివారం బొల్లెపల్లి మాధవరావుపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మాధవరావును చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పోలేరమ్మ ఆలయ కమిటీ విషయంలో నెలకొన్న వివాదమే దాడికి కారణమని మాధవరావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోటి తండ్రిని మాధవరావు దూషించాడనే కోపంతో కోటి తన స్నేహితుడు పవన్‌తో కలిసి దాడికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

