శక్తి సాయినగర్ డివిజన్లో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
సీఎం రేవంత్ రెడ్డి, ఉప్పల్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 17:
ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం సర్కిల్ శక్తి సాయినగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శక్తి సాయినగర్ డివిజన్ అధ్యక్షుడు ఎస్వీ కృష్ణ కిట్టు ఆధ్వర్యంలో మంగళవారం బ్రహ్మపురి కాలనీ, దత్తాత్రేయ కాలనీలకు చెందిన ప్రజలు కలిసి సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.18వ డివిజన్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప్పల్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ధనంజయ,శంకర్ గౌడ్, చారి, ఉపేందర్,ఫిరోజ్ ఖాన్, విజయ రెడ్డి,నరేందర్ రెడ్డి,అన్వర్ యాకూబ్,పాషా,శ్రీనివాస్ గౌడ్ మదన్,రాజిరెడ్డి,రాంప్రసాద్,రవి, మదన్,కుమార్,స్వామి,లక్ష్మి రజిని రెడ్డి,ఉదయ్,రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్ గౌడ్,లింగాల రవీందర్, ప్రసాద్, శ్రీధర్, నరసింహ,అలీ హుస్సేన్, రాయప్ప,శత్రుఘన్ రామ్,రాజు వెంకటేష్, రాఘవేందర్ రెడ్డి, ప్రమోద్,శ్రీనివాస్ రెడ్డి,ప్రసాద్, సామి,అనిల్,కాజా,పాషా,శంకర్ తదితరులు పాల్గొన్నారు

