Homeజాతియంనషా ముక్త్ భారత్ సందేశంతో సైక్లింగ్ యాత్ర

నషా ముక్త్ భారత్ సందేశంతో సైక్లింగ్ యాత్ర

నషా ముక్త్ భారత్ సందేశంతో సైక్లింగ్ యాత్ర

న్యూఢిల్లీలో కాశ్మీర్–కన్యాకుమారి సైక్లింగ్ బృందానికి వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ ఘన స్వాగతం

న్యూ ఢిల్లీ, పెన్ పవర్, నవంబర్ 24:

హెచ్‌సీజీ 4వ ఎడిషన్ కాశ్మీర్–కన్యాకుమారి సైక్లింగ్ యాత్ర బృందానికి న్యూఢిల్లీలో వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశం, ఆరోగ్యం, ఫిట్‌నెస్, జాతీయ ఐక్యతతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్ యాత్ర కొనసాగుతోంది. ఇండియన్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు సభావట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన యువతే పునాది అని అన్నారు. యువత క్రీడలు, విద్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగుతున్న ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ఐక్యతకు బలమైన సందేశాన్ని ఇస్తోందని, నషా ముక్త్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైక్లింగ్ యాత్ర బృందానికి ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేసి, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు రణదీప్ రెడ్డి, సామాజిక కార్యకర్తలు గౌరవ్ పాటిల్, ఆయుష్ గుప్తా, గౌరవ్ టాండన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular