Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిభక్తి భావంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

భక్తి భావంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

భక్తి భావంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అన్నదానం

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 28:

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో శివాలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై అయ్యప్ప స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవాభావంతో కార్యక్రమాన్ని నిర్వహించిన గుడి మధుసూధన్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular