Homeఆంధ్రప్రదేశ్కాకినాడచేదువాడలో నువ్వా.. నేనా అన్నట్లు ద్విముఖ పోరు

చేదువాడలో నువ్వా.. నేనా అన్నట్లు ద్విముఖ పోరు

గెలుపుపై ఎవరి ధీమా వారిదే!

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 27:

కాజులూరు మండల పరిధిలోని చేదువాడ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కూరాటి రామకృష్ణ (మంచం), గుత్తాల శేషుకుమార్ (కత్తెర) మధ్య హోరాహోరీ ద్విముఖ పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం ఆసక్తికరంగా మారింది.

కూరాటి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతు తనకు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. తన మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆదరణతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు గుత్తాల శేషుకుమార్ మాట్లాడుతూ కూటమి నాయకుల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గ్రామస్తులంతా తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

చేదువాడ గ్రామంలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలతో పాటు మైనార్టీ ఓట్లు కూడా ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి. ఇరువురు అభ్యర్థులు తమకు ప్రజల మద్దతు ఉందంటూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రేపటి పోలింగ్‌తో తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular