Homeతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్‌లో బీసీ హాస్టళ్ల సంఖ్య పెంచాలి: చాపల అనిల్ కుమార్

హైదరాబాద్‌లో బీసీ హాస్టళ్ల సంఖ్య పెంచాలి: చాపల అనిల్ కుమార్

బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి.. 100కు పైగా కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలి

హైదరాబాద్‌లో బీసీ హాస్టళ్ల సంఖ్య పెంచాలి

అద్దె భవనాలకు స్వస్తి పలికి శాశ్వత భవనాలు నిర్మించాలి: విద్యార్థి నాయకుడు: చాపల అనిల్ కుమార్

హైదరాబాద్, పెన్ పవర్ నవంబర్ 28:

హైదరాబాద్‌లో బీసీ హాస్టళ్ల సంఖ్యను పెంచడంతో పాటు, అద్దె భవనాల్లో కాకుండా శాశ్వత భవనాల్లో హాస్టళ్లను నిర్వహించాలని విద్యార్థి నాయకుడు చాపల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని పల్లెటూర్ల నుంచి ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులు బీసీ హాస్టళ్లలో సీట్లు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే ఆర్థిక స్థోమత లేక చాలామంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతం బీసీ హాస్టళ్లు లేకపోవడంతో కొత్తగా 100కు పైగా హాస్టళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో హాస్టళ్ల నిర్వహణ వల్ల ప్రతి ఏడాది భవనాలు మారాల్సి వస్తోందని, దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతి హాస్టల్‌కు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఆహార కల్తీ, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టళ్లలో సీట్లు లేవనే కారణంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని చాపల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular