గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 21:వంచుల గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అభ్యర్థికి మద్దతుగా ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వంచుల గ్రామానికి చెందిన మర్రి కామేశ్వరరావు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, ఉపసంహరణ గడువులో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లొంజా గణపతిరావు సైతం పంచాయతీ పెద్దల సూచనలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు. అధిష్ఠానం సూచించిన అభ్యర్థి విజయానికి సహకరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

