కాజులూరు,పెన్పవర్,నవంబర్25ః కాజులూరు మండల పరిధిలోని శలపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా టేకుమూడి భాగ్యలక్ష్మి శంకర్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మంగళవారం ఎన్నికల గుర్తు రావడంతో ఆమె ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.శలపాక, మొగలిపాలెం,డేగలపేట గ్రామాల్లో ఇంటింటా విస్తృతంగా పర్యటిస్తూ తన మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను తమదైన శైలిలో అభ్యర్ధిస్తున్నారు.తన నామినేషన్ ప్రక్రియ కూడ పార్టీ జెండాలను పక్కన పెట్టి వినూత్న విధానంలో ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలో మార్పు చోటు చేసుకుంది. అన్నిపార్టీల నాయకులు, ప్రజల మద్దతుతో తాను ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని పేర్కొన్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామంలో ఎక్కువ ఓట్లు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం యువత పార్టీలకు అతీతంగా అంబేడ్కర్ ఆశయలతో నీలిరంగు జెండాతో తన నామినేషన్ సమయంలో మద్దతు పలకారు. దీంతో శలపాక గ్రామంలో ఒక్కసారిగా టేకుమూడి భాగ్యలక్ష్మికి ప్రజా మద్దతు పెరిగింది. శలపాక గ్రామపంచాయతీ ఎన్నికల్లో నువ్వా ..నేనా అన్నవిధంగా పోటీ రసవత్తరంగా మారింది. మండలం అంతా ఒక ఎత్తు ..శలపాక పంచాయతీ పోటీ మరో ఎత్తు అని స్దానికులు పెద్ద ఎత్తున చర్చించుకోవడం ఇక్కడ ఆసక్తిగామారింది. టేకుమూడి భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారంలో తొలిత కాస్త వెనుకబాటులో ఉన్నప్పటికీ…నామినేషన్ అనంతరం అనూహ్యంగా తనకు మద్దతు ప్రజాధారణ వెల్లువలా పెరిగిందన్నారు. 29వ తేదీ ఆదివారం జరగనున్న శలపాక పంచాయతీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మిశంకర్ లకు ప్రజలు ఒక సారి అవకాశం ఇస్తే ..గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభృద్దిచేయడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రధానంగా తాగునీరు సమస్య ఉంది. మంచినీటి సమస్యను శాస్వతంగా పరిస్కరించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామంలో నెలకొన్న డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
మురుగునీరు పోయేందుకు గ్రామంలోని పెద్దలను, నాయకులను ,అధికారులతో చర్చించి అవుట్ లెట్ లు ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలను పరిస్కరిస్తానంటూ ఆమె శలపాకపంచాతీ పరిధిలోని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.కావున శలపాక గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని ప్రజలందరికీ నా మనవి.కూటమి నాయకులు సలాది వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు మాకు ముఖ్యం. పంచాయతీలో దీర్ఘ కాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సర్పంచ్ కృషి చేయడం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

