కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 25:
నామవానిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుంటూరి కీర్తి ప్రియ ఎన్నికల బరిలో నిలిచారు. తన ఎన్నికల గుర్తు మంచం అని పేర్కొంటూ గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తూ ప్రజలకు పలు సేవలు అందించానని తెలిపారు. అదే స్ఫూర్తితో సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, రహదారుల సమస్యలను గ్రామ నాయకులు, పెద్దలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గుంటూరి కీర్తి ప్రియ ఓటర్లను అభ్యర్థించారు.

