జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం, నవంబర్ 2: పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.
సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో రెండో విడత సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రూపొందించిన ఓటరు అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కు విలువను గుర్తించి ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. పోస్టర్లలో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఓటుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కరరావు, డ్వామా పీడీ రాంప్రసాద్, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.

